నేటి నుంచి జీ 7 స‌ద‌స్సు…మోడికి ప్ర‌త్యేక ఆహ్వ‌నం…

ఈరోజు నుంచి జీ7 దేశాల శిఖ‌రాగ్ర స‌ద‌స్సు బ్రిట‌న్‌లో జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఇప్ప‌టికే అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ లండ‌న్‌కు చేరుకున్నారు.  బ్రిట‌న్‌, అమెరికా, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్, జపాన్‌, కెన‌డా దేశాలు స‌భ్య‌దేశాలుగా ఉన్నాయి.  ఈ స‌భ్య‌దేశాల‌కు చెందిన అధినేత‌లు ఈ స‌మావేశంలో పాల్గొన‌బోతున్నారు. జీ7 దేశాల అభివృద్దితో పాటుగా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి, చైనా ప్రాబ‌ల్యం త‌గ్గించ‌డంపై కూడా ఈ చర్చించే అవ‌కాశం ఉన్న‌ది.  ఇక ఈ స‌మావేశాల‌కు భార‌త్‌, ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, ద‌క్షిణ‌కొరియా దేశాల‌కు ప్ర‌త్యేక ఆహ్వ‌నం పంపారు.  అయితే, భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి దృష్ట్యా ప్ర‌ధాని మోడి జీ7 స‌మావేశాల్లో నేరుగా కాకుండా వ‌ర్చువ‌ల్ విధానంలో పాల్గోన‌బోతున్నారు.  క‌రోనా వ్యాప్తి స‌మ‌యంలో జరుగుతున్న స‌మావేశాలు కావ‌డంతో ఏం చ‌ర్చించ‌బోతున్నారు, ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోబోతున్నారు అనే విష‌యాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన్న‌ది. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-