‘ఫన్ ఫీస్ట్ విత్ అషూరెడ్డి’.. ఎంటర్ టైన్మెంట్ 100% గ్యారెంటీ

ఎన్టీవీ.. ఈ సంక్రాంతి నుంచి ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచుతోంది. డిఫెరెంట్ డిఫరెంట్ ప్రోగ్రాంలతో కొత్త కొత్త స్టార్లతో మీ ముందుకు రానుంది. ఇప్పటికే మ్యూజిక్ ఎన్ ప్లే షో తో సంగీత ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రోగ్రాం స్టార్ట్ చేసిన ఎన్టీవీ తాజాగా బిగ్ బాస్ అభిమానుల కోసం మరోకొత్త టాక్ షో ని మొదలుపెట్టింది. బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘ఫన్ ఫీస్ట్ విత్ అషూరెడ్డి’. ఇక ఈ షో కి మొదటి గెస్ట్ గా బిగ్ బాస్ 4 టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరైన దేత్తడి హారిక గెస్టుగా హాజరయ్యింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఇద్దరు బిగ్ బాస్ బ్యూటీలు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడంతో స్టార్ట్ అయినా ప్రోమో బిగ్ బాస్ విశేషాలు, ప్రేమ, పెళ్లి, గాసిప్స్ తో సరదాగా నడిచింది. అలేఖ్య హారిక తాను బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉన్నది అనేది చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉండడంతో ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రోమోపై ఓ లుక్కేయ్యండి.

Related Articles

Latest Articles