దిష్టి చుక్క పెట్టనందుకే ఇలా… అంటున్న ఫరాఖాన్!

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ లో సెన్సాఫ్ హ్యూమర్ తక్కువేం లేదు. తాజాగా చేయించుకున్న కరోనా పరీక్షలో ఫరాఖాన్ కు కోవిడ్ 19 పాజిటివ్ రిజల్డ్ వచ్చిందట. ఈ విషయాన్ని కూడా ఆమె కాస్తంత సెటైరిక్ గానే వ్యక్తం చేసింది. ‘రెండు డోసులు వేసుకున్న వ్యక్తులతోనే నేను ఇటీవల పని చేశాను. అలానే నేను కూడా వాక్సినేషన్ డబుల్ డోస్ కంప్లిట్ చేశాను. అయినా కూడా నాకు కరోనా వచ్చింది. బహుశా నేను దిష్టి చుక్క పెట్టకపోవడం వల్లే ఇలా జరిగిందేమో!’ అంటూ హాస్యమాడింది. అంతే కాదు… ఈ మధ్య కాలంలో తనతో పనిచేసివారంతా ఓసారి కరోనా టెస్ట్ చేసుకోమని ఫరాఖాన్ కోరింది. దాదాపుగా అందరికీ తానీ విషయాన్ని చెప్పానని, కానీ వయసు పెరిగినందువల్ల, జ్ఞాపకశక్తి తగ్గినందువల్ల ఎవరి పేరైనా మర్చిపోయి ఉండొచ్చని విన్నవించుకుంది.

ఇటీవల అర్బాజ్ ఖాన్ చాట్ షోలో పాల్గొన్న ఫరాఖాన్ తరచూ తాను ఎదుర్కొనే విమర్శల విషయమై మనసు విప్పి మాట్లాడింది. తాను లావుగా ఉంటానని విమర్శించే వాళ్ళు కొందరైతే, ఇంత లావు మనిషికి, అంత సన్నటి పిల్లాలా? అంటూ తన కిడ్స్ నూ కొందరు వెక్కిరిస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలానే చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తానో క్రిటిక్ నని భావిస్తుంటాడని, సినిమాల గురించి అంతా తెలిసినట్టు ప్రవర్తిస్తుంటారని విమర్శించింది. ఇక సినిమాల విషయానికి వస్తే… ‘సత్తే పే సత్తా’ మూవీని హృతిక్ రోషన్ హీరోగా ఫరాఖాన్ రీమేక్ చేయబోతున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం వెలువడలేదు.

Related Articles

Latest Articles

-Advertisement-