అనుమానాస్పద స్థితిలో హాస్యనటుడి మృతి… హోటల్ గదిలో శవం

ఎంతో మంది ముఖాల్లో నవ్వులతో సంతోషాన్ని నింపిన ప్రముఖ అమెరికా హాస్యనటుడు బాబ్ సాగేట్ అనుమానాస్పద మృతి ఆయన అభిమానులను, హాలీవుడ్ ను కలచి వేసింది. స్థానిక షెరీఫ్ ప్రకారం ఈ స్టార్ ఆదివారం రాత్రి మరణించాడు. ఆయన మృతదేహం ఫ్లోరిడాలోని ఒక హోటల్ గదిలో కన్పించింది. 65 ఏళ్ళ వయసున్న ఈ హాస్యనటుడు అనుమానాస్పద మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Read Also : నటిపై అత్యాచారం కేసులో బెదిరింపులు… మళ్ళీ కష్టాల్లో పడ్డ స్టార్ హీరో

సమాచారం ప్రకారం.. ఆదివారం నాడు ఫ్లోరిడాలోని ఓర్లాండోలోని రిట్జ్-కార్ల్‌టన్‌లో ఆయన మరణించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆ హోటల్‌లోని ఉద్యోగులు ఆయన గదిలో నుంచి బయటకు రాకపోవడం, స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న షరీఫ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ఎలాంటి డ్రగ్స్ లేవని ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ట్వీట్ ద్వారా తెలియజేశారు.

Read Also : హృతిక్ రోషన్ ఇంటెన్స్ లుక్… ‘విక్రమ్ వేద’ ఫస్ట్ లుక్

బాబ్ సాగేట్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన స్టాండ్ కామెడీతో చాలా మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఆయన 1956 మే 17న అమెరికాలోనే జన్మించాడు. స్టాండ్ కామెడీతో పాటు టెలివిజన్ షోలను కూడా హోస్ట్ చేశాడు. 1887 నుండి 1995 వరకు ప్రసారమైన ABC టెలివిజన్ షో ‘ఫుల్ హౌస్‌’లో డానీ టాన్నర్ పాత్రతో పాపులర్ అయ్యారు. దీని సీక్వెల్ 2016లో ‘ఫుల్లర్ హౌస్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రారంభమైంది. ఆయన ‘అమెరికాస్ ఫన్నీయెస్ట్ హోమ్ వీడియోస్’ షోను కూడా హోస్ట్ చేశాడు.

Related Articles

Latest Articles