బాలీవుడ్ ‘కలెక్షన్’ కింగ్ కరణ్ జోహారే! కారణం… ఇదే!

ఈ మధ్య కాలంలో కరణ్ జోహర్ అంటే అదో కాంట్రవర్సియల్ నేమ్ గా మారిపోయింది. మొదట కంగనా నెపోటిజమ్ కామెంట్స్, ఆ తరువాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో, బాలీవుడ్ మాఫియా అంటూ ఆరోపణలు… ఇలా పుట్టెడు చిక్కుల్లో ఉన్నాడు కేజో. కానీ, ఆయన నెగటివ్ పాయింట్స్ ఎలా ఉన్నా బోల్డ్ థింకింగ్ మాత్రం కాదనలేనిది! ‘కాఫీ విత్ కరణ్’ అంటూ టాక్ షో నిర్వహించి రకరకాల చర్చలకు, వివాదాలకు కారణం అవుతుంటాడు కరణ్. కానీ, అదొక్కటే ఆయన బోల్డ్ బిహేవియర్ కి ఎగ్జాంపుల్ కాదు. మరోటి కూడా ఉంది. ఇప్పుడు ఏ టాప్ హీరో సినిమా వచ్చినా మనం వీకెండ్ అవ్వగానే ఇన్ని కోట్లు, అన్ని కోట్లు అంటూ ప్రకటనలు చూస్తుంటాం! మొదటి వారంలో మా వాడు ఇంత దోచేశాడు, అంత కుమ్మేశాడు అని మాస్ ఫ్యాన్స్ సొషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు కూడా! దీనికంతటికి ఆద్యుడు కరణ్ జోహరే…2010లో కేజో డైరెక్ట్ చేసిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమా విడుదలైంది.

అంతకు ముందు వరకూ బాలీవుడ్ లో ఒక్కో వారానికి కలెక్షన్లు ప్రకటించే సంప్రదాయం లేదు. బాక్సాఫీస్ వద్ద సినిమా లైఫ్ టైమ్ ముగిశాక ఒకేసారి గ్రాస్ వసూళ్లు ప్రకటించేవారు. అది కూడా అందరూ తప్పకుండా చేసే వారేం కాదు. కానీ, కరణ్ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’తో రూల్స్ తిరిగ రాశాడు. మొదటి వారం పూర్తి కాగానే ఆయన న్యూస్ పేపర్స్ లో భారీ యాడ్స్ వదిలాడు. సినిమా దేశదేశాల్లో ఆడుతోన్న సెంటర్లు, వసూలు చేసిన కలెక్షన్స్ సగర్వంగా ప్రకటించాడు. దాంతో అదే బాటలో మిగతా బాలీవుడ్ బిగ్గీస్ కూడా బయలుదేరారు! ఒక దశలో ఒక్కో సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే పదులు, వందల కోట్ల మార్కు దాటేసిందంటూ ఊదరగొట్టారు! అఫ్ కోర్స్, ప్యాండమిక్ దెబ్బకు ఇప్పుడదంతా గతమైపోయింది! మళ్లీ వందల బాక్సాఫీస్ వసూళ్లు ప్రకటనలు రావాలంటే… కరోణ కరుణించాల్సిందే!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-