దేశంలో చ‌మురు ధ‌ర‌లు దిగిరాబోతున్నాయా?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఇప్ప‌టికే వంద దాటిపోయింది.  దీంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  వాహ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టి ప‌బ్లిక్ వాహ‌నాల్లో ప్ర‌యాణం చేస్తున్నారు.  క‌రోనాకు ముందు రూ.80 వ‌ర‌కు ఉన్న పెట్రోల్ ధ‌ర‌లు ఆ త‌రువాత వంద దాటిపోయింది.  క‌రోనా కాలంలో ప్ర‌భుత్వానికి ఆదాయం లేక‌పోవ‌డంతో చ‌మురు ధ‌ర‌ల‌పై ట్యాక్స్‌ను పెంచాయి.  దీంతో చ‌మురు ధ‌ర‌లు అమాంతం కొండెక్కాయి.  

Read: కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అని పెట్ట‌డం వెనుక కార‌ణం ఏంటి? ఆ రెండు అక్ష‌రాలు ఎందుకు వ‌దిలేశారు?

చ‌మురు ఉత్ప‌త్తిని పెంచాల‌ని భార‌త్ ఇప్ప‌టికే ప‌లుమార్లు ఒపెక్ ప్ల‌స్ దేశాల‌ను కోరింది.  సౌదీ, ర‌ష్యాల మ‌ధ్య నెల‌కొన్న ర‌గ‌డ కార‌ణంగా చ‌మురు ఉత్ప‌త్తిని పెంచేదిలేద‌ని ఒపెక్ దేశాలు స్ప‌ష్టం చేశాయి.  దీంతో వ్యూహాత్మ‌క నిల్వ‌ల్లో నుంచి 50 ల‌క్ష‌ల బ్యారెళ్ల ముడి చ‌మురును వినియోగించుకోవ‌డానికి భార‌త్ సిద్ద‌మ‌యింది.  చ‌మురు సంక్షోభం స‌మ‌యంలో వినియోగించుకునేందుకు ప‌లు దేశాలు ఇలా వ్యూహాత్మ‌క నిల్వ‌ల‌ను సిద్ధం చేసుకుంటాయి.

Read: ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది… మెగా అభిమానులకు గూస్ బంప్స్ షురూ

 ప్ర‌పంచంలో అతిపెద్ద వ్యూహాత్మ‌క చ‌మురు నిల్వ‌లున్న దేశాల్లో భార‌త్ కూడా ఒక‌టి.  దేశంలో చ‌మురు ధ‌ర‌ల‌ను నియంత్రిచాలంటే డిమాండ్ కు త‌గినంత చ‌మురు ఉత్ప‌త్తి చేయాలి.  కాని డిమాండ్ కంటే తక్కువ‌గా 5.4 మిలియ‌న్ బ్యారెళ్ల చ‌మురును ఉత్ప‌త్తి చేస్తున్నాయి ఒపెక్ ప్ల‌స్ దేశాలు. క‌రోనా మ‌హమ్మారి స‌మ‌యంలో బ్యారెట్ ముడి చ‌మురు ధ‌ర కేవ‌లం 20 డాల‌ర్లుగా మాత్ర‌మే ఉంది.  క‌రోనా నుంచి కోలుకున్నాక ఆ ధ‌ర తిరిగి 80 డాల‌ర్ల‌కు చేరుకుంది.  ఇప్పుడు క‌రోనా మ‌హమ్మారి మ‌ళ్లీ విజృంభించే అవ‌కాశం ఉండ‌టంతో మ‌రోసారి ముడిచ‌మురు ధ‌ర‌లు ప‌డిపోయే అవ‌కాశం ఉంది.  ఇటు వ్యూహాత్మ‌క నిల్వ‌ల నుంచి ముడిచ‌మురును వాడుకోవ‌డానికి కూడా భార‌త్ సిద్ధ‌మ‌యింది.  ఇదే జ‌రిగితే దేశంలో పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు త‌గ్గ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. 

Related Articles

Latest Articles