బీటీఎస్, లేడీ గాగా, జస్టిన్ బీబర్ కు… చైనా బుల్లితెరపైకి ‘నో ఎంట్ర్రీ’!

‘ఫ్రెండ్స్ : ద రీయూనియన్’… మార్చ్ 27న ప్రసారం అయింది. అమెరికాలో హెచ్ బీఓ మ్యాక్స్, ఇండియాలో జీ5 ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకి అందించాయి. అయితే, 1994 నుంచీ 2004 దాకా… పదేళ్ల పాటూ ‘ఫ్రెండ్స్’ టెలివిజన్ షో ఆడియన్స్ ని ఎంతగానో అలరించింది. అటువంటి పాప్యులర్ తాలూకూ నటీనటులు ఇప్పుడు మళ్లీ కలిశారు. ఆ రీయూనియన్ పై ప్రపంచం అంతా ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టే 27వ తేదీన భారీ స్పందన లభించింది కూడా. అయితే, చైనాలో మాత్రం ఎందరో ప్రముఖులు పాల్గొన్న ‘ఫ్రెండ్స్ : ద రీయూనియన్’ షో తీవ్రంగా సెన్సార్ కి గురైంది.

అప్పట్లో ‘ఫ్రెండ్స్’ సీరియల్ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు జెన్నీఫర్ యానిస్టన్, కొర్ట్నీ కాక్స్, లీసా కుడ్రో, మాట్ లీబ్లాంక్, మాథ్యూ పెర్రీ, డేవిడ్ స్కిమ్మర్ ప్రధాన పాత్రలు పోషించారు. వారంతా రీయూనియన్ కి హాజరయ్యారు. అయితే, వీళ్లే కాక బీటీఎస్ బ్యాండ్ లోని మ్యుజీషియన్స్, లేడీ గాగా, జస్టిన్ బీబర్ లాంటి వారు కూడా షోలో పాలుపంచుకున్నారు. కానీ, చైనాలో బీటీఎస్, లేడీ గాగా, జస్టిన్ బీబర్ పర్ఫామెన్స్ లు మొత్తం తొలగించారట. అంతే కాదు, ఎల్జీబీటీ వ్యక్తులు కొందరు తమ అభిప్రాయాలు చెప్పాగా వాట్ని చైనాలో సెన్సార్ చేసేశారు. మొత్తం 6 నిమిషాల నిడివి షో నుంచీ తీసేశారట. దీనికి కారణం ఏంటో కమ్యూనిస్టు చైనాలో పాలకులు, అధికారులకే తెలియాలి. కానీ, చైనీస్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా నష్టపోయారనే చెప్పాలి! అయితే, ఇలాంటి సెన్సార్ లు డ్రాగన్ కంట్రీలో షరా మామూలే…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-