తెలంగాణలో కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కిడ్నీ వాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైద‌రాబాద్, వ‌రంగ‌ల్ న‌గ‌రాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల్లో తక్షణమే డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఎయిడ్స్ రోగులకు 5, హెపటైటిస్ రోగుల కోసం మరో 5 పడకలను కేటాయించాలన్నారు. 

Read Also: తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం

కిడ్నీ రోగుల‌కు డయాల‌సిస్ చేయించుకోవ‌డం ఆర్థికంగా చాలా భారంగా మారింద‌ని… ఈ నేప‌థ్యంలో వారి కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించిన‌ట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ప్రస్తుతం కిడ్నీ బాధితులకు తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో 43 డయాలసిస్ కేంద్రాలు నడుస్తున్నాయని, వీటి ద్వారా 10 వేల మంది రోగులకు డయాలసిస్ సేవలను అందిస్తున్నట్లు హరీష్‌రావు పేర్కొన్నారు. డయాలసిస్ సెంటర్ల నిర్వహణకు తెలంగాణ సర్కారు ప్రతి ఏడాది రూ.100 కోట్లను ఖర్చు చేస్తోందన్నారు.

Related Articles

Latest Articles