కిలో టమాటా ఇస్తే బిర్యానీ ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

టమాటా పేరు చెబితే చాలు జనం హడలిపోతున్నారు. టమోటా ధర 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. తమిళనాడులో అయితే 150 రూపాయలకు కిలో టమోటా అమ్ముతున్నారు. దీంతో టమోటాలు కొనడం మానేశారు జనం. భోజన ప్రియులైతే బిర్యానీలపై పడ్డారు. చెన్నైలో ఓ బిర్యానీ సెంటర్ వారు పెట్టిన ఆఫర్ బంపర్ హిట్ అయింది. కిలో టమాటాలు తీసుకొస్తే.. అందుకు బదులుగా ఓ కిలో బిర్యానీ ఉచితంగా ఇస్తామని ఓ బిర్యానీ సెంటర్ ప్రకటించింది. చెన్నై శివార్లలో ఉన్న అంబూర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకుల ఆఫర్ ఇది.

Read Also:అమ్మో వద్దమ్మా…! పెట్రోల్ రేటుని దాటేసిన టమాటా

బిర్యానీ లవర్స్ కోసం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అందుకు కారణం కూడా వుంది. వర్షాలతో అల్లాడిన చెన్నైలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. టమాటా అక్కడ కేజీ రూ.150లకు పైగా పలుకుతుంది.

ఈ నేపధ్యంలో చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం ప్రాపర్టీలోని అంబూర్ బిర్యానీ షాప్ యజమాని తన సేల్స్ పెంచుకోవడం కోసం కొత్త ఆఫర్ ప్రకటించారు. దీంతో బిర్యానీ కోసం భోజన ప్రియులు ఎగబడుతున్నారు. అంబూర్ బిర్యానీ షాప్‌లో ఒక కేజీ బిర్యానీ వంద రూపాయిలు.. ఎవరైనా రెండు కేజీల బిర్యానీ కొంటే వారికి అరకిలో టమాటాలు ఫ్రీగా ఇస్తామని ఆఫర్ చేశారు. ఒక కేజీ టమాటోలు తీసుకుని వచ్చి ఇస్తే.. ఒక కేజీ బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ఇవ్వడంతో క్యూ కట్టారు. దీంతో యజమాని పంట పండింది. బిర్యానీకీ బాగా గిరాకీ పెరిగింది.వాణింబాడిలో రెండు బిర్యానీలు కొంటే కేజీ టమాటా ఫ్రీగా ఇస్తున్నారు.

కిలో టమాటా ఇస్తే బిర్యానీ ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

Related Articles

Latest Articles