చైనాలో మ‌రో నాలుగు క‌రోనా వైర‌స్‌లు…విస్తృత ప‌రిశోధ‌న‌లో…

చైనాలోని వూహాన్ న‌గ‌రంలో మొద‌లైన క‌రోనా మ‌హమ్మారి ప్ర‌పంచం మొత్తాన్ని అత‌లాకుత‌లం చేసింది.  ఆర్ధికంగా ముందుకు వెళ్తున్నాయ‌ని అనుకున్న దేశాలు క‌రోనాతో ఒక్క‌సారిగా కుదేల‌య్యాయి.  క‌రోనాపై చైనా ముంద‌స్తుగా స‌మాచారం ఇవ్వ‌లేద‌ని, క‌రోనా వైర‌స్ వూహాన్ ల్యాబ్ నుంచే బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని అమెరికాతో స‌హా ప్ర‌పంచ‌దేశాలు ఆరోపిస్తున్నాయి.  ఇక‌పోతే, చైనా ప‌రిశోధ‌కులు మ‌రో భ‌యంక‌ర‌మైన నిజాన్ని బ‌య‌ట‌పెట్టారు.  2019 మే నెల నుంచి గ‌త ఏడాది న‌వంబ‌ర్ వ‌ర‌కు  అడ‌విలో సంచ‌రించే గ‌బ్బిలాల నుంచి న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.  24 ర‌కాల వైర‌స్ జ‌న్యుక్ర‌మాల‌ను సేక‌రించ‌గా అందులో సార్స్‌కొవ్‌2 ర‌కానికి చేందిన క‌రోనా వైర‌స్‌లు నాలుగు ర‌కాలున్నాయని, స్పైక్ ప్రోటీన్ మిన‌హా మిగ‌తా జ‌న్యుక్ర‌మం అంతా క‌రోనా వైర‌స్ మాదిరిగా ఉంద‌ని, ఈ ర‌క‌మైన వైర‌స్‌లు గబ్బిలాల నుంచి మ‌నుషుల‌కు సోకుందా లేదా అనే దానిపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ట్టు షాడాంగ్ విశ్వ‌విధ్యాల‌య శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.  ఈ ర‌క‌మైన వైర‌స్‌లు గబ్బిలాలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయని ప‌రిశోధ‌కులు తెలియ‌జేస్తున్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-