దారుణంః ముంబైలో ఘోర ప్ర‌మాదం…9 మంది మృతి..

ముంబైలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. గ‌త కొన్ని రోజులుగా ముంబైలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఈ వ‌ర్షాల కార‌ణంగా మ‌ల్వాని లోని ఓ నాలుగు అంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలిపోయింది.  ఈ ప్ర‌మాదంలో 9 మంది మృతిచెందారు.  8 మందికి గాయాల‌య్యాయి.  విష‌యం తెలుసుకున్న అత్య‌వ‌స‌ర‌, ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని శిధిలాల కింద చిక్కుకున్న 15 మందిని ర‌క్షించారు.  భ‌వ‌నం కుప్ప‌కూలిపోవ‌డంతో స‌మీపంలో ఉన్న కొన్ని భ‌వ‌నాల‌లోని ప్ర‌జ‌ల‌కు ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.  వ‌ర్షాల కార‌ణంగా భ‌వ‌నం కూలిపోయిన‌ట్టు ఆ రాష్ట్ర మంత్రి అస్లాం షేక్ తెలిపారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-