దళిత బంధుపై సీఈసీకి ఫిర్యాదు.. హుజురాబాద్‌లో ఆపండి..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‘దళిత బంధు’పై ప్రత్యేకంగా ఫోకప్‌ పెట్టారు.. పైలట్‌ ప్రాజెక్టుగా ముందుగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేసి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్‌ చేస్తున్నారు.. ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలతో సమావేశం కూడా నిర్వహించారు సీఎం కేసీఆర్.. అయితే, దీనిపై రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి.. హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. రాజకీయంగా లబ్ధిపొందడానికే ఈ పథకం తెచ్చారని ఆరోపిస్తున్నారు.. మరోవైపు.. ఈ వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్లింది.. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ముగిసే వ‌ర‌కు ద‌ళిత బంధు కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ.. భారత ప్రధాని ఎన్నికల కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు ఫోరం ఫర్ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రతినిధులు.. ముఖ్యంగా హుజురాబాద్‌లో దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని సీఈసీకి ఫిర్యాదు చేశారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ఎలా స్పందిస్తుంది..? ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

-Advertisement-దళిత బంధుపై సీఈసీకి ఫిర్యాదు.. హుజురాబాద్‌లో ఆపండి..!

Related Articles

Latest Articles