మాజీ మంత్రి అనుమానాస్పద మృతి.. మంచంపై విగతజీవిగా..!

మాజీ మంత్రి అనుమానాస్పదంగా మృతిచెందడం యూపీలో కలకలం రేపుతోంది.. మాజీ మంత్రి, బీజేపీ నేత‌ ఆత్మారామ్ తోమ‌ర్‌ తన ఇంట్లో మృతిచెందారు.. బెడ్‌రూంలో మంచంపై విగ‌త‌జీవిగా పడి ఉండడాన్ని గమనించిన ఆయన డ్రైవర్‌.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.. అయితే, ఆత్మారామ్‌ తోమర్‌ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత హత్య కేసుగా మార్చాల్సి వచ్చింది..

సీనియర్‌ బీజేపీ నేత ఆత్మరామ్ తోమర్‌ హత్యపై మీడియాతో మాట్లాడిన పోలీసులు.. ఉద‌యం డ్రైవ‌ర్ వెళ్లేస‌రికి ఆత్మారామ్ తోమ‌ర్ ఇంటి త‌లుపులు మూసి ఉన్నాయని.. కాలింగ్ బెల్ కొట్టిన ఎంత‌సేప‌టికి త‌లుపు తీయ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన డ్రైవ‌ర్ చుట్టుపక్కలవాళ్లను పిలిచాడని.. అంతా త‌లుపులు బ‌ద్దలు కొట్టారని.. ఆత్మారామ్ త‌న బెడ్‌రూంలో మంచంపై విగ‌త జీవిగా పడిఉండడాన్ని చూసి అంతా షాక్‌ తిని.. తమకు, ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవచ్చారని వెల్లడించారు. ఇది తెలిసినవారి పనిగానే పోలీసులు అనామానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఆత్మారామ్‌ను హత్య చేసిన తర్వాత.. కనిపించకుండా పోయిన ఆయన కారులోనే నిందితులు పరారైనట్టు భావిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-