ఏపీలో టీడీపీకి మరో షాక్‌.. శోభా హైమావతి రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది… పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన శోభాహైమావతి.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. 1999-2004 మధ్య ఎస్.కోట ఎమ్మెల్యేగా పని చేసిన హైమావతి… గత ఎన్నికల కంటే ముందు వరకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు.. పార్టీల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. అయితే, ప్రస్తుతంలో ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోవడానికి తోడు… టీడీపీలో అంతర్గత రాజకీయాలు కూడా ఎక్కువైనట్టుగా విమర్శలు ఉన్నాయి.. అంతర్గత రాజకీయాలు భరించలేకే తాను టీడీపీని వీడుతున్నట్టు శోభా హైమావతి చెబుతున్నారు.. ఎంత పనిచేసినా.. పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్న ఆమె.. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరి టీడీపీకి రాజీనామా చేసిన శోభా హైమావతి.. ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారో వేచిచూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-