కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. పార్టీ మారనున్న మాజీ సీఎం..

గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద షాక్‌ తగిలింది. మేఘాలయ కాంగ్రెస్‌లో చీలికలు మొదలయ్యాయి. మేఘాలయలో మొత్తం 60 సీట్లకు కాంగ్రెస్‌ అభ్యర్థులు 21 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న మేఘాలయ మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా తన అనచరులు 12 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

అంతేకాకుండా టీఎంసీ పార్టీలో చేరుతున్నట్లు స్పీకర్‌కు లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. 12 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినట్లు టీఎంసీ వర్గాలు కూడా వెల్లడించారు. దీంతో మేఘాలయలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీఎంసీ అవతరించింది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Related Articles

Latest Articles