చిత్తూరు జిల్లాలో విషాదం.. ఏనుగుల దాడిలో ఉద్యోగి మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడి స్థానికంగా కలకలం రేపింది. అటవీశాఖలో ఏనుగుల ట్రాకర్ సహాయకుడిగా చిన్నబ్బ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా గ్రామంలో సంచరిస్తున్న 14 ఏనుగుల గుంపును తమిళనాడు అటవీప్రాంతానికి చిన్నబ్బ మళ్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఏనుగులు తిరగబడ్డాయి. వాటికి ఏమైందో తెలియదు కానీ… చిన్నబ్బపై దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నబ్బ మరణించాడు. కాగా మృతుడు చిన్నబ్బ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బలిజపల్లె వాసి అని అధికారులు వెల్లడించారు.

Read Also: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. మహిళా పోలీస్ విభాగం ఏర్పాటు

కాగా ఇటీవల విజయనగరం జిల్లాలోనూ ఏనుగులు ట్రాకర్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఎలిఫెంట్ ట్రాకర్ నిమ్మక రాజబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా గుమడ వాసిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు.

Related Articles

Latest Articles