విజయవాడ విమానాశ్రయంలో విదేశీ సర్వీసులు పునః ప్రారంభం…

నేటి నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీ సర్వీసులు పునః ప్రారంభం అవుతున్నాయి. గల్ఫ్ లోని మస్కట్‌, కువైట్‌.. సింగపూర్‌ ఇతర దేశాల నుంచి తరలిరానున్నాయి సర్వీసులు. అయితే ఏప్రిల్ 3వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిచి పోయాయి విదేశీ సర్వీసులు. ఈరోజు సాయంత్రం 6.10 గంటలకు 65 మంది ప్రవాసాంధ్రులతో చేరుకోనున్నాయి దుబాయ్ సర్వీస్. వందే భారత్ మిషన్లో భాగంగా రానున్న విదేశీ సర్వీసులకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసారు. ఆదివారం మినహా ఇతర రోజుల్లో వారానికి 10 విదేశీ సర్వీసులు రానున్నాయి. అయితే అక్టోబర్ వరకు కొనసాగనున్న వందే భారత్ మిషన్లోని విదేశీ సర్వీసులు… 18 దేశాల నుంచి ఇప్పటివరకు 496 ప్రత్యేక విమానాల్లో 56,038 మంది ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి చేర్చాయి. అత్యధికంగా కువైట్ నుంచి 224 విమానాల్లో ఏపీకి చేరారు 29,356 మంది ప్రయాణికులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-