పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్ లో ఫోక్ సాంగ్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సూపర్ హిట్ మలయాళ రీమేక్ “అయ్యప్పనుమ్ కోషియం”లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రానా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అదిరిపోయే ఫోక్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ సాంగ్ ను రికార్డు చేయబోతున్నారట. మరి ఈ ఫోక్ సాంగ్ ను ఎవరు పాడతారో చూడాలి. కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో సినిమా షూట్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. రానా ఇందులో క్రేజీ పాత్రలో కనిపించనున్నాడు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరి హర వీర మల్లు’, హరీష్ శంకర్ చిత్రాలతో పవన్ బిజీగా ఉన్నారు. ఇటీవలే పవన్ ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-