డిసెంబర్‌ చివరినాటికి సాధారణ స్థితిలోకి విమాన సేవలు

కరోనా మహమ్మారి నేపథ్యంలో స్థంభించిన అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు ఈ ఏడాది చివరి నాటికి సాధారణ స్థితికి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని బుధవారం విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ బన్సాల్‌ వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ విమానప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెల్సిందే.. అయితే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో వివిధ దేశాలు నిబంధనలు, ఆంక్షలను సడలిస్తున్నాయి.

ఇప్పటికే అన్ని రూట్లలో 33 శాతం విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతవారంలో అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను సాధారణ స్ధితికి తీసుకుని రావడానికి కేంద్రం ప్రయత్నం చేస్తోందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వెల్లడిం చారు. ఇందులో భాగంగా పర్యాటక వీసాలను ఈ నెల 15 నుంచి కేంద్రం జారీ చేస్తుంది. మరోవైపు గత నెల నుంచి దేశీయంగా పూర్తిస్థాయి విమానయాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విమాన సేవలను మెరుగు పర్చడానికి పౌర విమానయాన శాఖ ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకుంది.

Related Articles

Latest Articles