శంషాబాద్ లో విమానం అత్యవసర ల్యాండింగ్… కారణమేంటంటే..?

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న VTIXK ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేసారు. అయితే విమానంలోని బాత్ రూమ్ లాక్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన ఆధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసారు. అనంతరం… హూటా హూటీన సిఐఎస్ఎఫ్ ఆధికారులను రప్పించి తనిఖీ చేయడంతో విమానంలోని బాత్ రూమ్ లో అక్రమ బంగారం లభ్యం అయ్యింది. ఆ బంగారం స్వాధీనం చేసుకున్న సెక్యూరిటీ అధికారులు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అలాగే దుబాయ్ నుండి బంగారం తరలించిన ఇద్దరు మహిళల ప్రయాణికులను అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులు విచారణ చెపట్టారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-