కృష్ణా నదిలో ఈతకెళ్లి ఐదుగురు చిన్నారులు గల్లంతు

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో విషాదం నెలకొంది. కృష్ణా నదిలో ఈతకెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. మధ్యాహ్నం ఇంటి నుంచి మున్నేరు వాగు వైపు వెళ్లిన పిల్లలు రాత్రి అయినా తిరిగిరాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గల్లంతైన వారిని చరణ్, బాలయేసు, అజయ్, రాకేష్, సన్నీగా పోలీసులు వెల్లడించారు. నది ఒడ్డున విద్యార్థుల బట్టలను వారు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: పంచెకట్టి వేషం మార్చారు.. ఏసీబీ దెబ్బకు హడల్

గల్లంతైన చిన్నారులంతా 8-13 ఏళ్ల మధ్య వయసు వారే అని పోలీసులు తెలిపారు. విద్యార్థుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామని వారు పేర్కొన్నారు. కాగా విద్యార్థులు నదిలో గల్లంతయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related Articles

Latest Articles