బీసీసీఐకి మరో షాక్… కరోనా బారిన పడిన ఢిల్లీ గ్రౌండ్ సిబ్బంది

ఐపీఎల్ 2021 సీజన్ కు కరోనా సెగ తాకిన విషయం తెలిసిందే. ఈరోజు కోల్‌కత నైట్‌ రైడర్స్‌ జట్టులో అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదాన సిబ్బంది ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం వారందరూ ఐసొలేషన్‌కు వెళ్లిపోయారట. ఢిల్లీ వైద్య బృందం వారికి ప్రత్యేక చికిత్స అందిస్తోంది. బయో బబుల్‌ వాతావరణంలో ఉన్నా కూడా ఏకంగా ఐదుగురికి వైరస్ సోకడం ఇప్పుడు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పెద్దల్లో ఆందోళన మొదలైంది. అయితే రేపు ఢిల్లీ మైదానంలో జరిగే సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచును బీసీసీఐ నిర్వహిస్తుందా… లేదా అనేది చూడాలి. అయితే ఇప్పటికే ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles