మ‌న‌దేశంలో తొలి బుల్లెట్ బండిని వాడింది ఎవ‌రో తెలుసా?

ఇప్పుడు ఎక్క‌డ చూసినా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బండి క‌నిపిస్తోంది.  ఈ బండిపై వ‌స్తున్న పాట‌లు ఫేమ‌స్ అవుతున్నాయి.  రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ నుంచి వ‌చ్చిన ఈ బుల్లెట్ బండ్లు మొద‌ట త‌యారైంది ఇంగ్లాండ్ దేశంలో.  ఇంగ్లాండ్ లోని రెడిచ్ ప‌ట్ట‌ణంలోని హంట్ ఎండ్ అనే చిన్న గ్రామం ఉంది.  ఈ గ్రామంలో సూదులు, సైకిల్ సీట్లు, పెడ‌ళ్లు వంటి వాటిని త‌యారు చేసే జార్జి టౌన్సెండ్ అండ్ కో అనే కంపెనీ ఉండేది.  1891 వ‌ర‌కు బాగా న‌డిచిన కంపెనీ ఆ త‌రువాత అప్పుల‌పాలైంది.  అప్పులు పాల‌వ్వ‌డంతో ది ఈడీ మ్యానుఫ్యాక్చ‌రింగ్ అనే కంపెదీ దానిని కొనుగోలు చేసింది.  

ఆ త‌రువాత ఆ కంపెనీకి బ్రిట‌న్ నుంచి ఆయుధాలు త‌యారు చేసే ఆర్డ‌ర్లు రావ‌డంతో ఒక్క‌సారిగా ఫేమ‌స్ అయింది. ఆయుధాలు త‌యారు చేసే క‌ర్మాగారంగా మార‌డంతో ది ఈడీ కంపెనీ పేరును రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ గా మార్చేశారు. ఆయుధాల‌తో పాటుగా నాలుగు చ‌క్రాల‌తో కూడిన రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌ను త‌యారు చేశారు.  అంత‌గా ఫేమ‌స్ కాక‌పోవ‌డంతో మూడు చ‌క్రాల‌తో కూడిన బండిని త‌యారు చేశారు.  ఆ త‌రువాత రెండు చ‌క్రాల బండి అందుబాటులోకి వ‌చ్చింది.  1907 లో వివిధ ర‌కాల ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను త‌యారు చేశారు.  ద్విచ‌క్ర‌వాహానాలు ఆక‌ట్టుకోవ‌డంతో బ్రిట‌న్ ప్ర‌భుత్వం త‌మ సైనికుల కోసం పెద్ద ఎత్తున వీటిని కోనుగోలు చేసింది.  

Read: క‌రెన్సీ నోట్ల‌పై ముద్రించే గాంధీ బొమ్మ‌ ఎక్క‌డిదో తెలుసా?

1930 వ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి 13 ర‌కాల మోడ‌ళ్లు అందుబాటులోకి వ‌చ్చాయి.  అందులో నాలుగు వాల్వ్‌లు, సింగిల్ సిలిండ‌ర్‌తో కూడిన బండి అందుబాటులోకి వ‌చ్చింది.  దానికి బుల్లెట్ అని పేరు పెట్టారు. బుల్లెట్ బండి సౌండ్ ఆక‌ట్టుకోవ‌డంతో విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. 1948లో మ‌ద్రాస్ మోటార్స్ సంస్థ ఇంగ్లాండ్‌కు చెందిన రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌తో టైఅప్ అయ్యింది.  రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను ఇండియాకు తీసుకొచ్చింది ఈ కంపెనీ.  ఈ బండి ఇండియాలోకి రాక‌ముందు ట్ర‌యంఫ్‌, బీఎస్ఏ వంటి మోటార్ సైకిళ్లను సైన్యం వినియోగించేది.  అయితే, ఈ బండ్లు బొర్డ‌ర్ రోడ్ల‌పై ప‌హారా కాసేందుకు అనుకూలంగా ఉండేవి కాదు.  రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన బుల్లెట్ బండి అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఇండియ‌న్ ఆర్మీ కోసం ఈ బండ్ల‌ను భార‌త ప్ర‌భుత్వం కొనుగోలు చేసింది.  వీటిని భార‌త జ‌వానులు తొలిసారిగా వినియోగించారు.  

Related Articles

Latest Articles