చైనాలో మ‌రో కొత్త వైర‌స్‌: తొలి మ‌ర‌ణం న‌మోదు…

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాండించిన కోవిడ్ 19 వైర‌స్ చైనాలో పుట్టిన సంగ‌తి తెలిసిందే.  కాగా, చైనాలో తాజాగా మ‌రో కొత్త వైర‌స్ క‌ల‌క‌లం రేపుతున్న‌ది.  కోతుల నుంచి సంక్ర‌మించే మంకీ బీ వైర‌స్ మాన‌వుల్లో తొలికేసు న‌మోద‌యింది.  తొలికేసు న‌మోదైన కొన్ని రోజుల్లోనే ఆ వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్టు చైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  ప్ర‌స్తుతానికి ఒక్క‌కేసు మాత్ర‌మే న‌మోదైన‌ట్టు చైనా సీడీసీ ప్ర‌క‌టించింది.  మంకీబీ సోకిన వ్య‌క్తి నుంచి మ‌రోక‌రికి ఈ వైర‌స్ సోక‌లేదని చైనా చెబుతున్న‌ది.  జంతువుల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపే ఓ ప‌శువైద్యుడికి తొలిగా ఈ వైర‌స్ సోకింది.  

Read: ఒక క‌రెంట్ స్థంబంలో అనేక ఫీచ‌ర్లు… ఇండియాలో మొద‌టి స్మార్ట్ పోల్‌…

ఈ ఏడాది మార్చి నెల‌లో చ‌నిపోయిన కొతుల‌ను పోస్ట్‌మార్టం చేసి ప‌రిశోధ‌న‌లు చేస్తున్న స‌మ‌యంలో వాటి నుంచి మంకీబీ వైర‌స్ ఆ వైద్యుడికి సోకింది.  వాంతి, వికారం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యాడు.  ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ ఆ వైద్యుడు మ‌ర‌ణించిన‌ట్టు చైనా ప్ర‌క‌టించింది. వైద్యుడు మ‌ర‌ణించిన అనంత‌రం అత‌ని శ‌రీరాన్ని ప‌రీక్షించ‌గా మంకీబీ వైర‌స్ సోకిన‌ట్టు, ఆ వైర‌స్ కార‌ణంగానే మ‌ర‌ణించిన‌ట్టు చైనా వైద్యాధికారులు దృవీక‌రించారు.  మంకీబీ వైర‌స్‌ను మొద‌ట 1932 లో మకాక్స్ అనే కోతిలో క‌నుగోన్నారు.  ఈ వైర‌స్ సోకితే మ‌ర‌ణాల సంఖ్య 70 నుంచి 80 శాతం ఉంటుంద‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చైనా పరిశోధ‌కులు చెబుతున్నారు. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-