ఫస్ట్ లుక్ : ఆసక్తికరంగా ఆది సాయికుమార్ “అతిథి దేవోభవ”

యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ఆది తాజాగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తో వచ్చాడు. ఆయన శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తన తదుపరి మూవీకి సంతకం చేసాడు. ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. సినిమాకి “అతిథి దేవోభవ” అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన “అతిథి దేవోభవ” షూటింగ్ మొత్తం పూర్తయింది. మేకర్స్ త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తుండగా, అమరనాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు తీసుకున్నారు.

Read Also : సామ్ విషయంలో నాగ్ మౌనం… కారణం?

బ్యాక్-టు-బ్యాక్ సరికొత్త జోనర్లలో సినిమాలు చేస్తున్న ఆది ఎక్కువగా ప్రతిభావంతులైన యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో కిట్టిలో బ్లాక్, అమరన్, కిరాతక, అతిథి దేవోభవ సినిమాలు ఉన్నాయి. చాలాకాలంగా హిట్ అనే మాటకు దూరమైన ఆది మరి ఇందులో ఏ సినిమాతో హిట్ అందుకుంటాడో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-