9 రసాలు… జూలై 9న ప్రోమో… ఆగస్ట్ 9న రిలీజ్!

మణిరత్నం నిర్మాణంలో తెరకెక్కిన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘నవరస’. పేరుకి తగ్గట్టుగానే తొమ్మిది రసాలు, భావోద్వేగాలతో కూడిన తొమ్మిది కథలు ఉంటాయంటున్నారు. ‘నవ’ అంటే తొమ్మిదే కాదు… ‘నవ’ అంటే ‘కొత్త’ అని కూడా కదా… ‘నవరస’ యాంథాలజీ సరికొత్తగా ఉంటుందట. శుక్రవారం ఈ వెరైటీ వెబ్ సిరీస్ ప్రోమో విడుదల కానుంది. ఇంకా అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. కానీ, ఆగస్ట్ తొమ్మిదిన నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవ్వొచ్చని టాక్ బలంగా వినిపిస్తోంది.

‘సూరరై పోట్రు’ సినిమాతో ఇప్పటికే ఓటీటీలో విజయాన్ని అందుకున్న స్టార్ హీరో సూర్య ‘నవరస’లో కనిపించబోతున్నాడు. ఆయనకు ఇదే డెబ్యూ వెబ్ సిరీస్ కానుంది. గౌతమ్ వాసుదేవ మెనన్ డైరెక్షన్ చేసిన ఎపిసోడ్ లో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. సూర్య, గౌతమ్ మెనన్ ల ఎపిసోడ్ లో ‘ప్రేమ’ రసం ఉప్పొంగనుంది.

గౌతమ్ మెనన్ కాకుండా మరో ఎనిమిది మంది దర్శకులు ‘నవరస’ కోసం పని చేశారు. అరవింద్ స్వామీ, బిజోయ్ నంబియార్, హలితా షమీన్, రవీంద్రన్ ఆర్. ప్రసాద్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, పొన్ రమ్, కేవీ ఆనంద్ ఒక్కో ఎపిసోడ్ రూపొందించారు. విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, రేవతి, అంజలి, అథర్వా, సిద్ధార్థ్, పూర్ణ లాంటి తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా తెలిసిన చాలా మంది సీనియర్ నటీనటులు ‘నవరస’లో నటించారు. ప్రోమో కోసం, యాంథాలజీ వెబ్ సిరీస్ విడుదల కోసం ప్రస్తుతం నెటిజన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-