ఇండియాలో మ‌రో ఫంగ‌స్‌..ఊపిరితిత్తుల‌పై దాడి…

ఇండియాలో క‌రోనా మ‌హ‌మ్మారి ఒక‌వైవు ఇబ్బందులు పెడుతుంటే, మ‌రోవైపు ట్రీట్‌మెంట్ త‌రువాత త‌లెత్తున్న ఇన్‌ఫెక్ష‌న్లు ఆంధోళ‌న క‌లిగిస్తున్నాయి.   క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాత బ్లాక్ ఫంగ‌స్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి.  బ్లాక్ ఫంగ‌స్‌తో పాటుగా వైట్‌, యెల్లో, రోజ్ క‌ల‌ర్ ఫంగ‌స్ కేసులు కూడా ఇటీవ‌ల న‌మోద‌య్యాయి.  ఈయితే, ఇండియాలో ఇప్పుడు మ‌రో ఫంగ‌స్ బ‌య‌ట‌ప‌డింది.  మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్‌లో నివ‌శిస్తున్న ఓ వ్య‌క్తి క‌రోనా నుంచి కోలుకున్నాక ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్‌తో ఆసుప‌త్రిలో చేరాడు. అర‌బిందో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో అత‌నికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా సైన‌స్‌, ఊపిరితిత్తుల్లో గ్రీన్ ఫంగ‌స్ క‌నిపించింది.  ఊపిరితిత్తుల్లో 90శాతం గ్రీన్ ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్‌తో నిండిపోయింద‌ని వైద్యులు చెబుతున్నారు.  ఈ గ్రీన్ ఫంగ‌స్ బ్లాక్ ఫంగ‌స్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని వైద్యులు పేర్కొన్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-