25న రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్

రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘శేఖర్’. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. లలిత్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను ఈ నెల 25న విడుదల చేయనున్నారు. లక్ష్మీభూపాల్ రచన చేస్తున్న ఈ చిత్రానికి మల్లిఖార్జున నారగాని సినిమాటోగ్రాఫర్. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హీరోగా రాజశేఖర్ కి ఎలాంటి పేరు తెస్తుందో చూడాలి.

Read Also : పవన్ తో రాజమౌళి భేటీ… కథ ఎక్కడికి దారి తీస్తోంది ?

Related Articles

Latest Articles