ఈ రాష్ట్రాల్లో ఫ‌స్ట్ డోస్ పూర్తి…

క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.  ఈ ఏడాది జ‌న‌వ‌రి 16 వ తేదీ నుంచి వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.  మొద‌ట నిదానంగా సాగిన వ్యాక్సినేష‌న్ ప్రక్రియ ఆ త‌రువాత ద‌శ‌ల వారీగా పెంచుకుంటూ వెళ్లారు. కాగా నేటితో దేశంలో వంద‌కోట్ల డోసుల వ్యాక్సినేష‌న్ పూర్తయింది.  ప్ర‌పంచంలోనే అత్య‌ధిక డోసులు వేసిన దేశంగా భార‌త్ నిలిచింది.  దేశంలోని 9 రాష్ట్రాల్లో, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో అర్హులైన అంద‌రికీ మొద‌టి డోసు వ్యాక్సినేష‌న్ పూర్త‌యిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  అండ‌మాన్ నికోబార్ దీవులు, చండీగ‌డ్‌, గోవా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, జ‌మ్మూకాశ్మీర్‌, ల‌క్ష‌ద్వీప్‌, సిక్కిం, ఉత్త‌రాఖండ్‌, దాద్రాన‌గ‌ర్ హ‌వేలీలో మొదటి డోసు వ్యాక్సినేష‌న్‌ను పూర్తిచేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రాల‌కు మొత్తం 103.5 కోట్ల డోసులు స‌ర‌ఫ‌రాచేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  రాష్ట్రాల వ‌ద్ధ ఇంకా 10 కోట్ల డోసులు ఉన్నాయ‌ని ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  

Read: జనసేన ఎమ్మెల్యే రాపాకపై అనర్హత వేటు పడుతుందా..?

Related Articles

Latest Articles