తిరుపతిలోని ఓ సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం

తిరుపతిలోని ఓ సినిమా థియేటర్‌లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. భూమా సినీ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఈ కాంప్లెక్సులోని విఖ్యాత్ థియేటర్ బాల్కనీలో ఉండే 180 సీట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. కాగా కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ థియేటర్‌లో ప్రదర్శనలు నిలిపివేశారు.

Read Also: నిజాయతీకి ప్రతిఫలం.. 54వ సారి IAS అధికారి బదిలీ

కాగా ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. సకాలంలో తిరుపతి అగ్నిమాపక శాఖకు చెందిన రెండు ఫైర్ ఇంజిన్లు చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్థి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజంగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం కావాలనే ఈ ఘటనకు ఎవరైనా పాల్పడ్డారా అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Related Articles

Latest Articles