కోవిడ్ ఆసుప‌త్రిలో అగ్నిప్ర‌మాదం…50 మంది మృతి…

ఇరాక్‌లోని ఓ కోవిడ్ ఆసుప‌త్రిలో ఘోర అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది.  ఈ అగ్నిప్ర‌మాదంలో 50 మంది మృతి చెందారు.  మ‌ర‌ణాల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.  వివ‌రాల్లోకి వెళ్తే…ఇరాక్‌లోని న‌సీరియా ప‌ట్ట‌ణంలోని అల్ హుస్సేన్ అనే కోవిడ్ ఆసుప‌త్రిలో ఆక్సీజ‌న్ ట్యాంక్ పేలింది.  ఈ పెలుడు కార‌ణంగా మంట‌లు పెద్దఎత్తున వ్యాపించాయి.  క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే మంట‌లు క‌రోనా రోగులు చికిత్స పొందుతున్న కోవిడ్ వార్డుకు వ్యాపించాయి.  

Read: పుకార్లకు చెక్ పెట్టిన తలైవి

ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టికే 50 మంది మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాల‌య్యాయి.  మ‌ర‌ణాల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ది.  70 ప‌డ‌క‌ల‌తో మూడు నెల‌ల క్రిత‌మే ఈ వార్డును ప్రారంభించారు.  ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో రాజ‌ధాని బాగ్ధాద్‌లోని కోవిడ్ ఆసుప‌త్రిలో ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది.  ఆ ఘ‌ట‌న‌లో 82 మంది మృతి చెంద‌గా, 110 మందికి గాయాల‌య్యాయి.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-