హాలండ్‌లో అగ్ని ప్రమాదం… హైదరాబాదీ మృతి

హాలండ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో హైదరాబాద్‌ అసిఫ్ నగర్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హాలండ్‌ హేగ్‌లోని తన నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన భారతీయుడు ఊపిరాడక మృతి చెందాడు. ఆసిఫ్‌నగర్ నివాసి అబ్దుల్ హదీ సెలవు కోసం భారతదేశానికి వచ్చి 2021 మార్చిలో తిరిగి హాలండ్ వెళ్ళాడు.

హాలండ్ లోని ఓ భవనం మొదటి అంతస్తులో ఉంటున్న అబ్దుల్ హదీ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. అతను వుండే ఇంటిలో పొగలు రావడంతో ఊపిరాడక ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో మృతిచెందాడు. అబ్దుల్ హది మృతదేహాన్ని నగరానికి చేర్చేలా తెలంగాణ ప్రభుత్వం తగిన సహాయం చేయాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. అబ్దుల్ హదీ మరణ వార్త తెలియగానే కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Related Articles

Latest Articles