బిగ్ బ్రేకింగ్: హీరోయిన్ రకుల్ ఇంట్లో అగ్ని ప్రమాదం

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలో ఆమె నివాసముంటున్న బిల్డింగ్ 12 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. రకుల్ షూటింగ్ నిమిత్తం వేరే చోట ఉండడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మంటలు ఎలా వచ్చాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Related Articles

Latest Articles