స్విస్ బ్యాంకుల్లో భారీగా పెరిగిన ఇండియ‌న్స్ బ్లాక్ మ‌నీ..! ఆర్థికశాఖ స్పంద‌న ఇది..

ఓవైపు క‌రానో విల‌యం సృష్టించింది.. మ‌హ‌మ్మారి, లాక్‌డౌన్ దెబ్బ‌తో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితిక‌పోయాయి.. చిన్న చిన్న సంస్థ మూత‌బ‌డ్డాయి.. పెద్ద సంస్థ‌లు కూడా భారీగా న‌ష్టాల‌ను చ‌విచూడాల్సిన ప‌రిస్థితి.. క్ర‌మంగా ఆ భారం ఉద్యోగాలు, ఉపాధిపై కూడా ప‌డింది.. అయితే, ఇదే స‌మ‌యంలో.. స్విస్ బ్యాంకుల్లో భార‌తీయుల సొమ్ము భారీగా పెరిగిపోయింద‌నే వార్త‌లు వ‌చ్చాయి.. స్విస్ బ్యాంకుల్లో 2019 చివరి నాటికి రూ. 6,625 కోట్లు (సీహెచ్ఎఫ్ 899 మిలియన్)గా ఉన్న భారతీయుల సొమ్ము 2020 చివరి నాటికి రూ. 20,700 కోట్లు (సీహెచ్ఎఫ్ 2.55 బిలియన్)కు చేరుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.. స్విస్ బ్యాంకుల్లో అమాంతం పెరిగిపోయిన డిపాజిట్ల‌పై జాతీయ మీడియాలో వ‌స్తున్నవార్త‌ల‌పై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ‌.. ఇది పూర్తిగా నిరాధారమైనవి అని కొట్టిపారేసింది.

దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన ఆర్థిక‌శాఖ‌.. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎన్ఎన్‌బీ) ద‌గ్గ‌ర ఉన్న అధికారిక గ‌ణాంకాల ప్ర‌కారం.. ఈ కాలంలో డిపాజిట్ అయిన మొత్తం భారతీయుల‌ది కాద‌ని.. ఎన్నారైలది కూడా కాదని, ఆ సొమ్ము ఇతర దేశాలకు చెందిన వారిద‌ని స్ప‌ష్టం చేసింది.. స్విస్ బ్యాంకుల్లో 2019 నుంచి ఖాతాదారుల డిపాజిట్లు క్షీణిస్తూ వ‌స్తున్నాయ‌ని.. బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర ఆర్థిక విధానాల్లో జమ చేస్తూ వ‌స్తున్నార‌ని క్లారిటీ ఇచ్చింది. ఫైనాన్షియల్ అకౌంట్స్ సమాచారం ప్రకారం కూడా స్విస్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ మొత్తం పెరిగినట్టు సమాచారం లేదని, పెరిగిన మొత్తం కూడా భారతీయులదేనని కచ్చితమైన సమాచారం లేదని స్ప‌ష్టం చేసింది ఆర్థిక‌శాఖ‌..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-