కేసీఆర్ రైతులను ఆదుకుంటే… బీజేపీ దోచుకుంటుంది

మెదక్ జిల్లాలో పాదయాత్రలు చేసే వారిని సూటిగా అడుగుతున్నా.. రైతులపై, జిల్లా ప్రజలపై ప్రేమ ఉంటే పెంచిన సిలిండర్ల ధర తగ్గించేందుకు పాదయాత్ర చేయాలి అని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. పెట్రోల్, గ్యాస్ సిలిండర్ల ధర పెంచడంతో రైతులపై భారం పడింది. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారింది. కేంద్ర ప్రభుత్వం రైతు ఉసురు పోసుకుంటున్నది. 5 లక్షల భీమా ఇచ్చి రైతుకు భరోసా ఇచ్చింది దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మల్లన్నసాగర్ భూసేకరణ చేస్తామంటే.. నమ్మలేదు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తెలంగాణ చేపట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడా లేవు. డీజిల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తున్నది. ఉన్న మార్కెట్లు ఎత్తి వేసి, డీజిల్ ధరలు పెంచిన రైతు వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. ఒక వైపు సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం తో రైతులను ఆదుకుంటుంటే డీజిల్ పేరుతో బీజేపీ దోచుకుంటుంది అని చెప్పారు. బీజేపీ నేతల పాదయాత్ర దేని కోసము… డీజిల్, గ్యాస్ ధరలు పెంచినందుకా.. మార్కెట్ లు ఎత్తి వేస్తునందుకా… దేనికో పాదయాత్రలు చేస్తున్న.బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి అని అడిగారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-