సినిమాటోగ్రఫీ చట్టసవరణపై డిస్ట్రిబ్యూటర్ల స్పందన

ఏపీలో సినిమాటోగ్రఫీ చట్టసవరణ బిల్లుకి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇకపై ఆన్ లైన్లోనే టికెట్ల విక్రయం జరగనుంది. దీనిపై ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు రోజుకు కేవలం 4 షోలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఏపీలో సినిమా టికెట్ బుకింగ్‌కి సంబంధించి ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై సైతం సినిమాటోగ్రఫి శాఖ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే సినిమా టికెట్ల బుకింగ్ సిస్టం తీసుకురావడానికి వెనుకున్న ప్రయోజనాలను వివరించారు. అయితే ఈ విధానంపై కొందరు డిస్ట్రిబ్యూటర్లు పెదవి విరుస్తున్నారు.

అంబికా కృష్ణ మాత్రం దీనిపై సానుకూలంగా స్పందించారు. టికెట్స్‌ ఆన్‌లైన్‌లో విక్రయించాలని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఎప్పటి నుండో కోరుతున్నారు, రేట్లు పెంచేది లేదని స్పష్టం చేశారు, ఎగ్జిబీటర్ల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Latest Articles