చిరు, మహేశ్ చిత్రాల కోసం… రాజమౌళి, బోయపాటి సినిమాలు వదులుకున్నారట!

టాలీవుడ్ లో స్టంట్ కొరియోగ్రఫీ అంటే వెంటనే గుర్తొచ్చే రెండు పేర్లు ‘రామ్-లక్ష్మణ్’. నిజానికి రామ్, లక్ష్మణ్ వేరు వేరు పదాలైనా… ఆ ఇద్దర్నీ ఒకే వ్యక్తిలా చూడటం ఇండస్ట్రీకి అలవాటైపోయింది! అంతగా మన టాలెంటెడ్ ట్విన్స్ కమిట్మెంట్ తో కలసి పని చేస్తుంటారు. ఎప్పుడూ టాప్ హీరోల చిత్రాల్లోని ఫైటింగ్ సీక్వెన్సెస్ తో బిజీబిజీగా ఉంటారు…

స్టంట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ఒకేసారి చాలా క్రేజీ సినిమాల్లో యాక్షన్ కంపోజ్ చేస్తుంటారు. వారి డేట్స్ ఒక్కసారి వృథా అయితే మళ్లీ దొరకటం చాలా కష్టం. అందుకే, దర్శకనిర్మాతలు వారిద్దరూ సెట్స్ మీద ఉన్నప్పుడు హీరో, విలన్ పైన చిత్రీకరించే కీలక సన్నివేశాలు పక్కాగా ముగించేస్తుంటారు. కానీ, కరోనా వచ్చి మీద పడటం, లాక్ డౌన్స్ ఏర్పడటం వల్ల మన స్టంట్ బ్రదర్స్ ప్లానింగ్ మొత్తం డిస్టబ్ అయిందట. దాంతో ‘ఆర్ఆర్ఆర్’, ‘అఖండ’ లాంటి అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్స్ వదులుకోక తప్పలేదట!

రాజమౌళితో ‘స్టూడెంట్ నంబర్ వన్’ మొదలు ‘విక్రమార్కుడు’ దాకా చాలా సినిమాల్లో కలసి పని చేశారు రామ్, లక్ష్మణ్. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ కోసం కూడా జక్కన్న తన ఫేవరెట్ స్టంట్ మాస్టర్స్ డ్యుయోనే సెలెక్ట్ చేసుకున్నాడు. కంటిన్యూగా 40 రోజుల పాటూ రామ్, లక్ష్మణ్ అందుబాటులో ఉండేలా ప్లానింగ్ జరిగింది. కానీ, తరువాత పది రోజులకే రామ్ చరణ్ గాయంతో షూటింగ్ వాయిదా పడింది. ఆ తరువాత కూడా పలుమార్లు ‘ట్రిపుల్ ఆర్’ ఆగిపోతూ ఉండటంతో రామ్, లక్ష్మణ్ ప్రాజెక్ట్ నుంచీ తప్పుకున్నారట. ఇతర సినిమాల షూటింగ్స్ తో ‘ఆర్ఆర్ఆర్’ లెంగ్తీ షెడ్యూల్స్ క్లాష్ అవుతుండటంతో మన మాస్టర్స్ ఇద్దరూ డ్రాప్ అవ్వాలని డిసైడ్ అయ్యారట.

బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వస్తోన్న ‘అఖండ’ కూడా స్టంట్ మాస్టర్స్ గా రామ్, లక్ష్మణ్ కి ఎంతో పేరు, డబ్బు తెచ్చి పెట్టే చిత్రమే. సెకండ్ హాఫ్ లో మన మాస్ డైరెక్టర్ నందమూరి నట సింహాతో బీభత్సమైన పోరాటాలు చేయిస్తున్నాడట. కానీ, రామ్,లక్ష్మణ్ కు ఇక్కడ కూడా డేట్స్ ఇష్యూనే వచ్చిందట. 40 రోజుల యాక్షన్ షెడ్యూల్ మొదట్లో ప్లాన్ చేసినప్పటికీ మహమ్మారి వల్ల మహా ఆలస్యం అవుతూ వచ్చింది ‘అఖండ’. దాంతో కొంత స్టంట్ కొరియోగ్రఫి చేసినప్పటికీ బోయపాటి శ్రీనుకి ‘సారీ’ చెప్పేశారట రామ్ అండ్ లక్ష్మణ్. ‘ఆచార్య, సర్కారు వారి పాట’ లాంటి భారీ చిత్రాలు కూడా వీరిద్దరి ఖాతాలో ఉండటంతో ఒకేసారి అన్ని చిత్రాలు చేయటం అసాధ్యంగా మారిందట. డేట్స్ కేటాయించటం ఇబ్బందిగా మారటంతో ‘ఆర్ఆర్ఆర్’, ‘అఖండ’ వదులుకుని ఇతర సినిమాలు మాత్రమే చేస్తున్నారట! చిత్ర పరిశ్రమలో బిజీ యాక్టర్స్, టెక్నీషీయన్స్ అందరికీ ఈ ‘డేట్స్’ ప్రాబ్లం ఎప్పుడూ ఉండేదే కదా…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-