దారుణం: కన్నకూతురినే గర్భవతిని చేసిన తండ్రి.. తల్లికి తెలియడంతో

వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నకూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిలా మారాడు. ఇంట్లో ఎవరికి తెలియకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు.. మోమిన్ పేటలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. మోమిన్ పేట నుంచి బతుకుదేరువుకోసం వచ్చిన ఒక వ్యక్తి కుటుంబంతో సహా హైదరాబాద్ లో పఠాన్ చెరువు ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతనికి ముగ్గురు కూతుళ్లు..

ఇటీవల పెద్ద కుమార్తె ఆరోగ్యం బాగోకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలిక గర్భవతి అని తెలిసింది. దీంతో ఖంగుతిన్న తల్లి.. బాలికను నిలదీసింది. కాగా, తన గర్భానికి కారణం కన్నతండ్రే అని, ఇంట్లో తల్లి లేని సమయంలో అతడు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పుకొచ్చింది. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించాడని, గత కొంతకాలంగా తండ్రి వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు చెప్పింది. దీంతో తల్లి, కూతుళ్లను తీసుకొని సొంత గ్రామం మోమిన్ పేటకు చేరుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసునమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Latest Articles