రెండేళ్లుగా కన్నకూతురిపై తండ్రి అత్యాచారం.. కోర్టు ఇచ్చిన తీర్పుకి షాక్!

కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి కోర్టు తగిన శిక్ష విధించింది. అతడికి మరణ శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. అదనపు సెషన్ జడ్జి నితిన్ కుమార్ దోషికి మరణ శిక్షతో పాటు రూ.51,000 జరిమానా కూడా విధించారని ప్రత్యేక జిల్లా ప్రభుత్వ న్యాయవాది సంత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. గతేడాది ఆగస్టులో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక వ్యక్తి తన మైనర్ బాలికకు కొన్నేళ్ల క్రితం వివాహం చేసి పంపించేసేశాడు. అనంతరం కొద్దిరోజులు అత్తవారింట్లో ఉన్నాకా వారి మధ్య విభేదాలు రావడంతో కూతురిని ఇంటికి తీసుకొచ్చేశాడు. ఆ తరువాత అతడి కన్ను కూతురిపై పడింది. ఇంట్లో భార్య లేని సమయంలో బాలికను బెదిరించి ఆమెపై అత్యచారం చేయడం మొదలుపెట్టాడు. ఇలా రెండుళ్లుగా మెన్కు ప్రత్యేక్ష నరకాన్ని చూపాడు. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది.

ఇక ఒక రోజు భర్త తన కూతురిపై అత్యాచారం చేయడం చూసిన తల్లి .. వెంటనే బాలికను తీసుకొని పోలీసులను ఆశ్రయించింది. ఏ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదనలు విన్న కోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఇలాంటి నీచమైన పనికి పాల్పడిన దోషికి మరణ శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ తీర్పు మరో సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది.

Related Articles

Latest Articles