“ఐరన్ మ్యాన్” ఇంట్లో విషాదం

“ఐరన్ మ్యాన్” రాబర్ట్ డౌనీ జూనియర్ తన తండ్రి మరణంతో విషాదంలో మునిగిపోయారు. దిగ్గజ చిత్రనిర్మాత, నటుడు రాబర్ట్ డౌనీ సీనియర్ గత రాత్రి నిద్రలోనే మరణించినట్టు ఆయన తనయుడు రాబర్ట్ జూనియర్ ప్రకటించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. డౌనీ జూనియర్ తన తండ్రిని “ట్రూ మావెరిక్ ఫిల్మ్ మేకర్” అని అన్నాడు. డౌనీ సీనియర్ గత కొన్ని సంవత్సరాలుగా పార్కిన్సన్ వ్యాధితో పోరాడుతున్నాడు. 1936లో జన్మించిన డౌనీ సీనియర్ మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. న్యూయార్క్ కు చెందిన అతనితో ప్రస్తుతం మూడవ భార్య రోజ్మేరీ రోజర్స్, అతని పిల్లలు ఉన్నారు. తన మొదటి భార్య ఎల్సీ ఆన్ డౌనీతో అతనికి ఇద్దరు పిల్లలు అల్లిసన్, రాబర్ట్ ఉన్నారు.

Read Also : “ఆర్టికల్ 15” రీమేక్ లో యంగ్ ఎమ్మెల్యే…!

ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేముందు ఆయన సైన్యంలో కూడా పని చేశాడు. రాబర్ట్ ప్రొడక్షన్, రచన, ఎడిటింగ్ లో కూడా చురుకుగా ఉన్నాడు. డౌనీ సీనియర్ ప్రయోగాత్మక చిత్రనిర్మాణాల్లో ముందుండేవారు. ఐదు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీకి సేవ చేసిన ఆయన ఖాతాలో ఎన్నో హిట్ మూవీస్ ఉన్నాయి. రాబర్ట్ డౌనీ సీనియర్ దర్శకత్వం వహించిన చిత్రాల జాబితాలో “బూగీ నైట్స్,” “మాగ్నోలియా,” “టు లైవ్ అండ్ డై ఇన్ ఎల్.ఎ.” ఉన్నాయి. అతను దర్శకత్వం వహించిన చివరి చిత్రం 2005 డాక్యుమెంటరీ “రిట్టెన్‌హౌస్ స్క్వేర్”.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-