ఆ పని చేసిందని కూతురిని రేప్ చేసి చంపిన తండ్రి.. చివరికి

ప్రపంచం రోజుకో కొత్త రంగు పులుముకొంటున్నా .. ఇంకా కొన్ని చోట్ల పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి.. కులమతాలకు అతీతంగా అందరు జీవించాలని చూస్తున్నా ఎక్కడో ఒక చోట ఇలాంటి దారుణ ఘటనలు షాక్ కి గురి చేస్తున్నాయి. కూతురు వేరొక కులం వ్యక్తిని ప్రేమించిందని, పెళ్లి చేసుకొని పరువు తీసిందని. కూతురునే, అల్లుడినో హతమారుస్తున్నారు. పరువు.. పరువు అంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఒక తండ్రి దారుణానికి పాల్పడ్డాడు.. ఆమెను అడవిలోకి టిఏసుకెళ్లి రేప్ చేసి హతమార్చిన ఘటన భోపాల్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. భోపాల్ కి చెందిన కమలేష్ కి ఇద్దరు కూతుళ్లు.. అందులో చిన్నకూతురు గతేడాది కులంకాని వ్యక్తిని ప్రేమించి, ఇంట్లోనుంచి వెళ్ళిపోయింది. భర్తతో కలిసి రాయ్ పూర్ లో కాపురం పెట్టిన ఆమె ఇటీవలే ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో ఆ బిడ్డ పుట్టిన కొన్నినెలలకే మృతిచెందాడు. కొడుకు పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆమె తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. విషయం విని చింతించాల్సిన ఆ తండ్రి పాత విషయాన్ని గుర్తు పెట్టుకుని కూతురిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు.

ఎనిమిది నెలల బిడ్డ శవాన్ని తీసుకొని అడవికి వస్తే, అక్కడ శవాన్ని పాతిపెట్టవచ్చని మాయమాటలు చెప్పి కూతుర్ని రప్పించాడు. అక్కడ కూతురిపై అత్యచారానికి పాల్పడి అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఆ విషయాన్ని అల్లుడికి ఫోన్ చేసి చెప్పి అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు కమలేష్ ని అరెస్ట్ చేశారు. తన కూతురు ప్రేమ వివాహం వలన తమ పరువు పోయిందని, అందుకే తన కూతురిని హతమార్చినట్లు తెలిపాడు. ఇక భార్య చనిపోయిందన్న బాధతో ఆమె భర్త కూడా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పరువు పోతుందని ఒక తండ్రి చేసిన దారుణానికి ఇద్దరు ప్రేమికులు బలయ్యారు.

Related Articles

Latest Articles