కోడలి ఇంటికి వచ్చి మరీ ఆ పని చేసిన మామ..

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. కొడుకు ఆత్మహత్యకు కోడలే కారణమనే కోపంతో ఒక మామ కోడలిని అతిదారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కోటపల్లి మండలం లింగన్న పేటకు చెందిన సౌందర్య (19) అనే యువతి అదే గ్రామానికి చెందిన తిరుపతి కుమారుడు సాయి కృష్ణ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 5 నెలల క్రితం వారు వివాహం చేసుకున్నారు. అయితే కారణం ఏంటో తెలియదు కానీ రెండు నెలల క్రితం సాయి కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సౌందర్య తల్లి ఇంటివద్దకు వచ్చి నివసిస్తోంది.

ఇక ఒక్కగానొక్క కొడుకును ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకొని ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించిందని తిరుపతి, కోడలిపై కక్ష పెంచుకున్నాడు. సోమవారం తల్లి గారి ఇంట్లో ఉన్న సౌందర్య వద్దకు వెళ్లి, తనతో పాటు తెచ్చిన కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Related Articles

Latest Articles