భూవివాదం.. తండ్రి, ఇద్ద‌రు కుమారుల దారుణ హ‌త్య‌

ఇరు వ‌ర్గాల మ‌ధ్య భూమి విష‌యంలో జ‌రిగిన గొడ‌వ.. ముగ్గురు హ‌త్య‌ల‌కు దారి తీసింది.. తెలంగాణ‌లో జ‌రిగిన ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా కాటారం మండ‌లం గంగారంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య ప‌త్తి చేన్ల వ‌ద్ద వివాదం మొద‌లైంది.. మాట‌లు, వాగ్వాదం, తోపులాట‌తో.. చివ‌ర‌కు గొడ్డ‌ళ్ల‌తో దాడి చేసేవ‌ర‌కు వెళ్లింది.. ఓ వ‌ర్గం గొడ్డ‌ళ్ల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన తంద్రి, ఇద్ద‌రు కుమారులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.. ముగ్గురుని హ‌త్య చేసిన దుండ‌గులు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు.. ఇక‌, స్థానికుల ఫిర్యాదుతో ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. కేసు న‌మోదు చేసిన హంత‌కుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-