తండ్రి, కొడుకులు తెలంగాణ ద్రోహులే: మాజీ మంత్రి చంద్ర శేఖర్‌

కేసీఆర్, కేటీఆర్ తండ్రీ కొడుకులు ఇద్దరూ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహులేనని మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్ర శేఖర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే కేటీఆర్‌ ఉలిక్కి పడుతున్నాడన్నారు. తెలంగాణ రైతులను ఆదు కొమ్మంటే, పంజాబ్ రైతులకు రూ.3 లక్షలు ఇస్తా అంటు న్నాడని ఎద్దేవా చేశారు. ఈ 7 ఏళ్లలో మీ అసమర్థ పాలన వల్ల, మీరు చేసిన ద్రోహం వల్ల వేల మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాల వైపు కనీ సం కన్నెత్తి చూడలేదన్నారు. మీరు ఎక్కడో ఢిల్లీ ధర్నాలో రైతులు చని పోయారట… వాళ్ళ కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తారట ఇక్కడ ఉన్న రైతులను పట్టించుకోరా అంటు ఆయన ప్రశ్నించాడు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నడట అంటూ విమర్శించారు.


ఈ నెల రోజుల్లో వడ్ల కుప్పల పై 6 గురు రైతులు చనిపోయారు. ఆ రైతు కుటుంబాలకు ముందుగా రూ.25 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. వరి వేస్తే ఉరే అని మీ నాన్న చేసిన మూర్ఖపు కామెంట్స్ తో 5 గురు వరి రైతులు గుండెపోటుతో చనిపోయారని కేటీఆర్‌ ఉద్దేశించి చంద్రశేఖర్ అన్నారు. 1400 మంది అమర వీరుల త్యాగాలపై మీ కుటుంబం భోగాలు అనుభవిస్తోంది. కనీసం 600 మం దికి కూడా సాయం అందలేదు. ఆ అమరుల కుటుంబాలకు ముందుగా ఆర్థిక సాయం అందించాలన్నారు.

ఉద్యోగాలు రాక వంద మందికి పైగా నిరుద్యోగ యువత ఆత్మ హత్య చేసుకుంది. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలన్నారు. నిరుద్యోగ యువకులకు రెండేళ్ల నుంచి బాకీ ఉన్న నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇవన్నీ అమలు చేశాక ఉత్తరాది రైతులకు సాయం చేస్తా అన్నా మాకేమి అభ్యంతరం లేద న్నారు. కానీ ఇక్కడి రైతుల చావుకు మీరే కారణమవుతూ ఎక్కడో ఢిల్లీ లో రైతుల పై ప్రేమ ఒలకపోస్తాం అంటే తెలంగాణ రైతులు చూస్తూ ఉరుకోరని, రాళ్లతో కొట్టి తరుముతారని చంద్రశేఖర్‌ అన్నారు

Related Articles

Latest Articles