ఓటీటీలో ‘వరుడు కావలెను’కు రికార్డ్ వ్యూస్

తెలుగు చిత్రపరిశ్రమలో యూత్ లో చక్కటి ఫాలోయింగ్ ఉన్న యువహీరో నాగశౌర్య. ఈ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. ఈ మూవీ ద్వారా లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలై చక్కటి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ జీ5లో విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే 5 కోట్ల నిమిషాల వ్యూస్ ని అందుకోవడం విశేషం. దీంతో టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 5 కోట్ల వ్యూ మినిట్స్ అందుకున్న చిత్రంగా రికార్డు సెట్ చేసింది. ఈ సంతోషకరమైన విషయాన్ని హీరో నాగశౌర్య తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Read Also : త్రిష హెల్త్ అప్డేట్… బ్యూటిఫుల్ పిక్ తో గుడ్ న్యూస్

Image

Related Articles

Latest Articles