‘అవతార్ 2’లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ యాక్షన్ స్టార్

‘అవతార్’… హాలీవుడ్ చరిత్రలోనే కాదు… ప్రపంచ సినిమా చరిత్రలోనే పెను సంచలనం అని చెప్పాలి. జేమ్స్ క్యామరూన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అటు అద్భుతమైన రివ్యూస్ ని, ఇటు అంతకంటే అద్భుతమైన బాక్సాఫీస్ రివార్డ్స్ ని స్వంతం చేసుకుంది. అయితే, ‘అవతార్’ తరువాత పార్ట్ టూ, త్రీ కోసం జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2022 డిసెంబర్ లో ‘అవతార్ 2’ అరుదెంచనుంది. అలాగే, డిసెంబర్ 2024లో ‘అవతార్ 3’ మనల్ని అబ్బురపరుస్తుందట!
‘అవతార్ 2’కి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ ఒక లెటెస్ట్ అప్ డేట్ సదరు ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ పెంచేసింది. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టార్ విన్ డీజిల్ ‘అవతార్ 2’లో నటించే అవకాశం ఉందనేది దాని సారాంశం! ఈ మాట మరెవరో కాదు స్వయంగా విన్ డీజిలే చెప్పాడంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన జేమ్స్ క్యామరూన్ గురించి మాట్లాడాడు. అతనితో పని చేయటం నాకు చాలా ఇష్టమని విన్ వ్యాఖ్యానించాడు. అయితే, ఇంత వరకూ ‘అవతార్ 2’ కోసం తాను షూటింగ్ లో అయితే పాల్గొనలేదని ట్విస్ట్ ఇచ్చాడు. ముందు ముందు జేమ్స్ క్యామరూన్ మచ్ అవెయిటెడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించే ఛాన్సెస్ ఉన్నాయి అన్నాడు!
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’తో ప్రస్తుతం యాక్షన్ లవ్వర్స్ ని థ్రిల్ చేయబోతోన్న విన్ డీజిల్ ‘అవతార్ 2’లో కనిపించే అవకాశాలే ఎక్కువ. చూడాలి మరి, డీజిల్ టీమ్ లో జాయినైతే, ఆ తరువాత, ‘అవతార్ 2’ బండి ఎలా పరుగులు తీస్తుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-