‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’… జూన్ లో అమెరికా, జూలైలో ఫ్రాన్స్!

‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ లో భాగంగా జూన్ 25న అమెరికాలో రిలీజ్ అవుతోంది ‘ఎఫ్ 9’. యాక్షన్ థ్రిల్లర్ ఫ్రాంఛైజ్ లో ఇది 9వ చిత్రం. అయితే, జూన్ 25న జనం ముందుకి రాబోతోన్న విన్ డీజిల్ స్టారర్ జూలై మొదటి వారంలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేయనుంది. జూలై 6 నుంచీ 17 దాకా ఫ్రాన్స్ లో ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవం చోటు చేసుకోనుంది. అందులో అథిథులు, సామాన్య జనం, పర్యాటకులకి ‘ఎఫ్ 9’ ప్రదర్శించనున్నారు. ఇప్పటికే దీనిపై కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహకులు ఓ ప్రకటన చేశారు. అయితే, స్పష్టంగా ‘ఎఫ్ 9’ అని చెప్పుకుండా ‘ఒక భారీ బ్లాక్ బస్టర్’ కనువిందు చేస్తుందన్నారు. దాంతో అప్ కమింగ్ జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైం టూ డై’, ‘డ్యూన్’, ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ లాంటి పేర్లు వినిపించాయి. కానీ, చివరకు కాన్స్ లో ‘ఎఫ్ 9’ కనువిందు చేస్తుందని తేలిపోయింది. చూడాలి మరి, జూన్ 25న యూఎస్ బాక్సాఫీస్ వద్దకి, జూలైలో కాన్స్ కి చేరుకోనున్న లెటెస్ట్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సాగా ఏ విధంగా యాక్షన్ లవ్వర్స్ ని మెప్పిస్తుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-