ప‌రిగిలో రైతుల ఆంధోళ‌న‌…భారీగా ట్రాఫిక్ జాం…

వికారాబాద్ జిల్లాలో ప‌రిగిలో రైతులు ఆంధోళ‌న‌ల‌కు దిగారు.  పెద్ద సంఖ్య‌లో రైతులు రోడ్డు మీద‌కు వ‌చ్చి నిర‌స‌న‌లు చేస్తున్నారు.  పండించిన వ‌రిధాన్యం వెంట‌నే కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆంధోళ‌న‌లు చేస్తున్నారు.  హైద‌రాబాద్‌-బీజాపూర్ హైవేపై రైతులు బైఠాయించారు.  రోడ్డుపై రాళ్లు పెట్టి వాహ‌నాల‌ను ఆపేశారు.  దీంతో దాదాపుగా రెండు కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. క‌లెక్ట‌ర్ వ‌చ్చి స్ఫ‌ష్ట‌మైన హామీ ఇచ్చేవ‌ర‌కు నిర‌స‌న కొన‌సాగిస్తామ‌ని రైతులు చెబుతున్నారు.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ అమ‌లు జ‌రుగుతున్న‌ది.  మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌వ‌ర‌కు స‌డ‌లింపులు ఉండ‌టంతో రైతులు పెద్దఎత్తున రోడ్డుమీద‌కు వ‌చ్చి ఆంధోళ‌న‌లు చేస్తున్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-