ధాన్యం కొనడంలేదని సొసైటీ ఆఫీసుకి తాళం

అన్నదాత కడుపు మండుతోంది. నారు పోసి, ఆరుగాలం కష్టాలు పడి పంట పండిస్తే కొనేవారు లేక రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. సొసైటీ కి తాళం వేసి నిరసన తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపారు రైతులు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు నెమ్మదిగా కొనసాగుతోందని ఆరోపించారు. అకాల వర్షాలతో రోజు రోజుకి ఆందోళన పెరుగుతుందని రైతులు వాపోతున్నారు.

తమ బాధలు, సమస్యలు పట్టనట్టు వ్యవహరిస్తున్న పోతుగల్ పీఏసీఎస్ సొసైటీ అధికారులు, పాలకవర్గానికి వ్యతిరేకంగా నిరసనలకి దిగారు ఆవునూరు రైతులు. ఒకవైపు వర్షాల వల్ల తాము పండించిన పంట నీటిపాలవుతోందని రైతులు మండిపడ్డారు. పంటలు పండించి ఆర్థిక ఇబ్బందులు తమను వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవంపై మండిపడుతున్నారు.

Related Articles

Latest Articles