పొలం పనుల్లో వరించిన అదృష్టం… కోటీశ్వరుడైన రైతు …

కర్నూల్ జిల్లాలో రైతులకు విలువైన వజ్రాలు దొరుకుతున్నాయి. జొన్నగిరి, పగిడిరాయి, జి ఎర్రగుడి, పెరవలి ప్రాంతంలో వజ్రాలు లభిస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ వజ్రాలు దొరుకుతున్నాయి. ఇందులో భాగంగానే ఆ జిల్లాలోని ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. చిన్న జొన్నగిరిలో పొలంలో పని చేసుకుంటుండగా ఆ రైతుకు ఈ విలువైన వజ్రం దొరికింది. ఈ వజ్రం ఏకంగా కోటి 25 లక్షలు పలికింది. వేలంలో భాగంగా వజ్రాన్ని కొనుగోలు చేశారు గుత్తి వ్యాపారులు. అదే బహిరంగ మార్కెట్ లో రూ. 3 కోట్లకు పైగా విలువ చేస్తుందని వజ్ర వ్యాపారులు చెబుతున్నారు. ఏది ఏమైనా కోటి 25 లక్షలు రావడంతో ఆ రైతు కుటుంబం ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-